సూర్యాపేటలో కొత్తగా మూడు కరోనా పాజిటివ్‌ కేసులు


సూర్యాపేట జిల్లాలో కొత్తగా 3 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి తెలిపారు. సూర్యాపేట పట్టణంలో ఇద్దరు, తిరుమలగిరిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా వచ్చిందన్నారు. ఇవాళ వచ్చిన 80 నమూనాల ఫలితాల్లో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలగా 77 మందికి నెగిటివ్‌గా వచ్చిందన్నారు. సూర్యాపేట జిల్లాలో ఇప్పటివరకు 23 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు.