స్వీయ నిర్భంధంలోకి శివసేన ఎంపీ..


కరోనా కారణంగా శివసేన ఎంపీ కృనాల్‌ తుమానే స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. మార్చి 18న పార్లమెంట్‌ సమావేశాలకు హాజరైన కృనాల్‌.. బీజేపీ ఎంపీ దుష్యంత్‌ సింగ్‌తో సన్నిహితంగా ఉన్నారు. అంతకు ముందు దుష్యంత్‌ సింగ్‌.. కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చిన సింగర్‌ కనికా కపూర్‌ హోస్ట్‌గా నిర్వహించిన ఓ ఈవెంట్‌లో పాల్గొన్నారు. అతి తక్కువ మంది పాల్గొన్న ఈ ఈవెంట్లో దుష్యంత్‌ సింగ్‌ కూడా పాల్గొనడంతో.. ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారు సెల్ఫ్‌ క్వారెంటైన్‌ పాటిస్తున్నారు.